కులగణన పేరు చెప్పడానికి ప్రధాని మోదీ భయపడుతున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. బహుజనులు వారి హక్కులు పొందడం బహుశా ప్రధానికి ఇష్టం లేదేమోనని పేర్కొన్నారు. బీజేపీ బహుజన వ్యతిరేక పార్టీ అంటూ ఆరోపించారు. బీజేపీ పార్టీ ఎన్ని అబద్ధాలు వ్యాప్తి చేసినా.. రిజర్వేషన్లకు ఎలాంటి నష్టం జరగనివ్వమంటూ కాంగ్రెస్ ఎంపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.