జమిలి ఎన్నికలంటే ప్రతిపక్షాలకు ఎందుకంత జంకు అని బీజేపీ నేత, మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ ప్రశ్నించారు. ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం కాంగ్రెస్కు అలవాటేనని ఎద్దేవా చేశారు. 2019 నుంచి జమిలి ఎన్నికలపై చర్చ సాగుతోందని, వన్ నేషన్.. వన్ ఎలక్షన్ అనే కొత్తేమీ కాదన్నారు. దేశంలో అభివృద్ధి జరగాలంటే జమిలి ఎన్నికలకు సహకరించాలని.. పార్టీలు వేరని సీఎం రేవంత్ రాజకీయం చేయడం సరికాదని వ్యాఖ్యానించారు.