VSP: అతి తక్కువ సమయంలో మహిళలు ధరించే 58,112 క్రోంచెట్ స్క్వెర్స్ నూలు వస్త్రంను తయారు చేసి విశాఖ మహిళలు గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించారు. వెంకోజీపాలెంలోని ఆదివారం ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆ వస్త్రాన్ని ప్రదర్శించారు. వాటిని గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లండన్ ప్రతినిధి స్వప్నిల్ డంగారికర్ పరిశీలించి రికార్డును ధ్రువీకరించారు.