జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత ప్రచారాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా హోరెత్తిస్తున్నారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించే వరకు పాక్‌తో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్చలు జరపబోదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. దాయాది దేశమైన పాక్ తన బుద్ధి మార్చుకోలేదని.. భారత్‌పై విషం చిమ్మేందుకు ఇంకా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూనే ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టికల్ 370ని ఎవరూ తిరిగి తీసుకురాలేరని తేల్చి చెప్పారు.