క్వాడ్ సదస్సులో భాగంగా మూడు రోజుల పర్యటన కోసం ప్రధాని మోదీ అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే. ఈ పర్యటన సందర్భంగా అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ను కలిసిన మోదీ.. ఆయనకు వెండితో చేసిన రైలు నమూనాను బహుమతిగా ఇచ్చారు. దీనిని మహారాష్ట్ర హస్త కళాకారులు తయారుచేశారు. అలాగే బైడెన్ సతీమణి జిల్ బైడెన్‌కు జమ్మూలో తయారు చేసిన పష్మినా శాలువాను బహూకరించారు. కాగా, 92.5 శాతం వెండితో చేసిన రైలు నమూనాపై ఢిల్లీ-డెలావర్ అని రాసి ఉంది.