AP: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ హాట్ కామెంట్స్ చేశారు. ఏ పార్టీలోకి వెళ్లినా కేసుల్లో నుంచి బాలినేని, ఆయన కుమారుడు తప్పించుకోలేరని హెచ్చరించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తనపై 32 అక్రమ కేసులు పెట్టించారని మండిపడ్డారు. తమ పార్టీ అధినేత సీఎం చంద్రబాబుని కూడా బాలినేని దూషించారని తెలిపారు. అధికారం పోయి 100 రోజులు గడవకముందే బాలినేని పార్టీ మారుతున్నారని ఎద్దేవా చేశారు.