TG: తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ జరగడం దురదృష్టకరమని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. విజనరీ లీడర్ అయిన సీఎం చంద్రబాబు భక్తులను ఆందోళనకి గురిచేసే వ్యాఖ్యలు ఎందుకు ఇచ్చారో అర్ధం కావడం లేదన్నారు. దేశ, విదేశాల్లో ఉన్న భక్తులు ఇప్పుడు లడ్డు తినాలా..?వద్దా..? అనే ఆందోళనలో ఉన్నారని పేర్కొన్నారు. రాజకీయ గొడవల్లోకి శ్రీవారిని లాగొద్దని సూచించారు. అసలు ఈ వివాదంపై తక్షణమే విచారణ చేసి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.