ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు బీసీసీఐ మెగా వేలం నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రిటెన్షన్ పాలసీ రూపొందించడంపై BCCI దృష్టి సారించింది. ఈ మేరకు ఫ్రాంచైజీలతో సమావేశమై వారి సూచనలు, సలహాలు తీసుకున్నట్లు సమాచారం. BCCI వర్గాల సమాచారం మేరకు ప్రస్తుత జట్టులో ఉన్న ఆరుగురు ఆటగాళ్లను ప్రతీ జట్టు అంటిపెట్టుకోవచ్చు. నలుగురిని నేరుగా రిటైన్ చేసుకుంటే.. మరో ఇద్దరిని వేలంలో ఆర్టీఎమ్ కింద తిరిగి కొనుగోలు చేయవచ్చు.