చెన్నై వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో టీమిండియా సరికొత్త రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు 580 టెస్టులు ఆడిన భారత్.. 180 విజయాలు సాధించింది. అలాగే, 222 మ్యాచ్‌లు డ్రా అవ్వగా.. 179 మ్యాచుల్లో ఓటమి చవిచూసింది. ఇలా పరాజయాల కంటే గెలుపులే అధికం కావడం ఇదే ప్రథమం. దీంతో అత్యధిక టెస్టు విజయాలు నమోదు చేసిన నాలుగో టీమ్‌గా భారత్ నిలిచింది.