కృష్ణా: నూజివీడు శ్రీనివాస మహల్ సెంటర్లో ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి మాల యోధుల సంక్షేమ సంఘం ఆదివారం పాలాభిషేకం చేసింది. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ… భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పట్ల అనుచితంగా వ్యవహరించిన రఘురామ కృష్ణంరాజు సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అతను బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు.