బంగ్లాదేశ్తో జరగనున్న రెండో టెస్టులోనూ ఎలాంటి మార్పులు లేకుండా టీమిండియా బరిలోకి దిగుతోందని BCCI స్పష్టం చేసింది. ఈ మేరకు ‘X’లో పోస్టు చేసింది. మొదటి టెస్టులో బంగ్లాపై భారత్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. రెండో టెస్టు కాన్పూర్లో ఈనెల 27 నుంచి జరగనుంది. కాన్పూర్ టెస్టు నుంచి స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇస్తారని మొదట భావించారు. కానీ, ఆ ఊహాగానాలకు BCCI తెరదించింది.