దులీప్ ట్రోఫీ మూడో రౌండ్లో భాగంగా జరుగుతున్న మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో ఇండియా-ఏ 286/8 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దీంతో ఇండియా-సికి 350 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. పరాగ్ 73, శశ్వత్ రావత్ 53 పరుగులతో రాణించారు. ఇండియా-సి బౌలర్లలో గౌరవ్ యాదవ్ 4 వికెట్లు పడగొట్టగా.. మానవ సుతార్, అన్షుల్ కంబోజ్ చెరో 2 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్లో ఇండియా-ఏ 297, ఇండియా-సి 234 పరుగులు చేసిన విషయం తెలిసిందే.