దులీప్ ట్రోఫీ మూడో రౌండ్లో భాగంగా జరుగుతున్న మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో ఇండియా-డి 305 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఇండియా-బికి 373 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రికి భుయ్ (119*), శ్రేయస్ అయ్యర్ 50, సంజూ శాంసన్ 45 పరుగులతో రాణించారు. ఇక ఇండియా-బి బౌలర్లలో ముఖేశ్ కుమార్ 4 వికెట్లు పడగొట్టగా.. నవ్‌దీప్ సైనీ 3 వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఇండియా-డి 349, ఇండియా-బి 282 పరుగులు చేసిన విషయం తెలిసిందే.