చెన్నై వేదికగా జరుగుతున్న భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ మూడో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ 158/4 పరుగులు చేసింది. కెప్టెన్ శాంటో(51), షకీబ్(5) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో అశ్విన్ 3, బుమ్రా 1 వికెట్ తీశారు. ఈ మ్యాచులో బంగ్లా విజయం సాధించాలంటే మరో 357 పరుగులు చేయాలి. కాగా భారత్ తొలి ఇన్నింగ్స్లో 376, రెండో ఇన్నింగ్స్లో 278 పరుగులకు డిక్లేర్డ్ చేయగా.. బంగ్లా 149 పరుగులకు ఆలౌట్ అయింది.