TG: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ బీసీ నేతలు డిమాండ్ చేశారు. HYDలోని తెలంగాణ భవన్లో BRS బీసీ ముఖ్యనేతల సమావేశం నిర్వహించారు. సమావేశంలో సమగ్ర కులగణనపై ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టినట్లు తెలుస్తోంది. తమిళనాడు, కేరళలోని రిజర్వేషన్ల విధానాన్ని అధ్యయనం చేయాలని పేర్కొన్నారు. సమగ్ర కులగణన చేసి, 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు.