AP: తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేయించాలని కోరుతూ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు పీసీసీ చీఫ్ షర్మిల వినతిపత్రం అందించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ‘కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం ఇది. NDDB రిపోర్ట్ ప్రకారం లడ్డూలో వాడే నెయ్యిలో కల్తీ జరిగింది. భక్తులకు పంపిణీ చేసే నెయ్యి రూ.320లకే కొనడం ఏంటి. ఇక్కడే అసలు విషయం తెలుస్తుంది. దీనిపై విచారణ అడిగే హక్కు వైసీపీకి లేదు’ అని తెలిపారు.