TG: BRS వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సవాల్ విసిరారు. ‘రూ.8,888 కోట్లకు టెండర్ పిలిచినట్లు నిరూపిస్తే తాను రాజీనామా చేస్తా.. నిరూపించకపోతే కేటీఆర్ రాజీనామా చేయాలి. నా సవాల్‌ను స్వీకరిస్తే రేపు ఉదయం ఎక్కడికైనా వస్తా.. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా తీసుకురావాలి. లేదంటే కేటీఆర్‌పై పరువు నష్టం దావా వేస్తాం’ అని మంత్రి అన్నారు.