బాంగ్లాదేశ్ లో శాంతి భద్రతుల ఆటంకం, నెలకొన్న అసమ్మతి, సంక్షోభం కారణాలుగా నేడు తాత్కాలిక ప్రధాని ప్రమాణస్వీకారం చేయనున్నారు. తాత్కాలికంగా మహమ్మద్ యూనస్ ప్రమాణస్వీకారం చేయనున్నారు అని ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమా ప్రకటించారు. బంగ్లా కాలమానం ప్రకారం ఈరోజు రాత్రి 8 గంటలకు 15 మంత్రులతో కూడిన ప్రభుత్వాన్ని మహమ్మద్ యూనస్ ఏర్పాటుచేయనున్నారు.
బాంగ్లాదేశ్ లో ఇంకా పరిస్థితులు చక్కబడలేదు, ప్రతిపక్షాలు ర్యాలీలు, నాయకుల రాజీనామాలు, హత్యలు, లూటీలు, పలు జైళ్ల నుంచి ఖైదీలు తప్పించుకోవడం లాంటి ఘటనలు జరుగుతున్నాయి. వివిధ జైళ్ల ఉంచి దాదాపు 400 మంది కచిడీలు తప్పించుకున్నట్టు బాంగ్లాదేశ్ పత్రికలూ కథనాలు రాశాయి. భారత్ లో ఆశ్రయం పొందడానికి వేల సంఖ్యలో మైనారిటీలు సరిహద్దుల దగ్గర పడిగాపులు కాస్తున్నారు. ఈ విజువల్స్ వైరల్ గా మారాయి
తాత్కాలిక ప్రధాని గ నియమితులైన యూనస్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ‘ విద్యార్థుల ధైర్య సాహసాలను మెచ్చుకున్నారు… ఈ గెలుపును సద్వినియోగం చేసుకోవాలి, తప్పిదాలు చేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు హిమసాత్మిక కార్యక్రమాలను విడిచిపెట్టు శాంతివైపు నడవాల్సింది గా కోరారు.