Gold Rate : బడ్జెట్ అనంతరం భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు
కేంద్రం బంగారంపై కస్టమ్స్ సుంకం తగ్గింపు పరిణామాల నేపథ్యంలో వెండి, బంగారం ధరలు భారీగా దిగి వస్తున్నాయి. ఏ లోహం ధర ఎంత ఉందనేది తెలుసుకోవాలంటే ఇక్కడ చదివేయండి.
Gold Rate Today : బంగారం, వెండి కొనుక్కోవాలని భావించేవారు ఈ వారంలో వీటి ధరలను నిశితంగా గమనిస్తూ ఉండటం ఆవస్యకం. ఎందుకంటే రెండు రోజుల క్రితం ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్లో బంగారంపై కస్టమ్స్ డ్యూటీని తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయంతో బుధవారం బంగారం మూడు వేల రూపాలకు పై చిలుకు వరకూ దిగి వచ్చింది. ఆ తర్వాత గురువారం సైతం దీని ధర భారీగా తగ్గిందనే చెప్పవచ్చు. నేడు దేశీయ మార్కెట్లో పసిడి ధర(gold rate) రూ.1,154 తగ్గింది. దీంతో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం రూ.70,230కి చేరుకుంది. విజయవాడ, హైదరాబాద్, విశాఖపట్నం తదితర నగరాల్లోనూ దీని ధర దాదాపుగా ఇలాగే ఉంది. అయితే ఈ ధర మార్కెట్ ప్రారంభం అయ్యే సమయంలో నమోదైనది. ఆ తర్వాత మళ్లీ మారే అవకాశాలు ఉంటాయి. అలాగే నగల్ని కొనుక్కోదలచిన వారు దుకాణంలో ఈ ధరకు అదనంగా రాళ్లు, మజూరీ, జీఎస్టీలను సైతం చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని తప్పక దృష్టిలో ఉంచుకోవాలి.
ఇక దేశీయ మార్కెట్లో వెండి ధరలు(silver rates) సైతం భారీగా తగ్గాయనే చెప్పవచ్చు. గత వారంలో రూ.95 వేలకు చేరుకున్న వెండి ధరలు ఇప్పుడు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. గురువారం సైతం రూ.3,670 తగ్గింది. దీంతో కేజీ వెండి ధర రూ.83,580కి చేరుకుంది. అలాగే అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్, వెండి ధరలు సైతం స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గురువారం ఔన్సు స్పాట్ గోల్డ్ 40 డాలర్లు తగ్గి 2416 డాలర్లకు చేరుకుంది. అలాగే ఔన్సు వెండి 27.96 డాలర్లకు చేరుకుంది. కాబట్టి వెండి, బంగారం కొనుగోలు చేసేవారికి ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు.