సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి జాతర జూలై 21, 22 తేదీల్లో జరగనుంది. ప్రతీ ఏడాది ఆషాఢమాసంలో జరిగే ఈ బోనాలకు హైదరాబాద్ లో వివిధ ప్రాంతాల నుంచే కాకుండా తెలంగాణ అలాగే మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు తరలి వస్తుంటారు. శుక్రవారం అమ్మవారి మినీ జాతర నిర్వహించారు, ఈ శుభసందర్భంగా ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు.
అమ్మవారి దర్శనం కోసం హైదరాబాద్ సిటీలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్ధం TGRTC ప్రత్యేక సర్వీస్ బస్సులను నడపనుంది. గ్రేటారు హైదరాబాద్ పరిధిలో 175 స్పెషల్ బస్సులు TGRTC నడపనున్నట్టు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. భక్తులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సింది గా ఆయన కోరారు.
భక్తుల కోసం ప్రత్యేక హెల్ప్ డెస్క్ కేంద్రాలు ఏర్పాటు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 99592 26147, జేబీఎస్- 99592 26143, MGBS- 99592 26130 నెంబర్లకు సంప్రదించవచ్చని ప్రకటన ద్వారా వివరించారు
అదే విధంగా బోనాలు సందర్భంగా ఉత్సవాలు శాంతాయుతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని, విద్యుత్ అంతరాయం ఏర్పడకుండా 500 కేవీ ట్రాన్స్ఫార్మర్లను, డీజిల్ జెనరేటర్లను అందుబాటులో ఉంచాలని ప్రభుత్వ CS శాంతి కుమారి ఆదేశాలు జరీ చేశారు. రేపు ఆదివారం అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు, 21న సోమవారం రంగం భవిష్యవాణి కార్యక్రమం నిర్వహిస్తారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని బోనాలకు హాజరు కావాలని నిర్వాహకులు ఆహ్వానించారు
జూలై 28, 29వ తేదీల్లో లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాలు జాతర నిర్వహించనున్నారు. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు