తెలంగాణ రాష్ట్రంలోని కాంట్రాక్టు ఉద్యోగులకు ఆర్థిక మంత్రి తీపి కబురు చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఏప్రిల్ నుంచి కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను క్రమబద్దీకరణ చేస్తున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు. సెర్ఫ్ ఉద్యోగులకు పే స్కేల్ సవరణ చేయబోతున్నట్లు హరీశ్ రావు తెలిపారు.కేంద్ర ప్రభుత్వం నిధుల్లో కోతలు విధిస్తున్నా…ఆర్థిక ఆంక్షలు పెడుతున్నా అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దెత్తున ఆర్థిక అవసరాలున్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయుల ప్రయోజనాల విషయంలో ఏనాడు తక్కువ చేయలేదన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తులతో ఈ కొత్త EHS విధానాన్ని తీసుకురాబోతున్నామని ప్రకటించారు. ఉద్యోగుల హెల్త్ కేర్ ట్రస్టును ఏర్పాటు చేసి ప్రభుత్వ ప్రతినిధులతోపాటు, ఉపాధ్యాయ, రిటైర్డు ఉద్యోగులను భాగస్వాములను చేస్తామని తెలిపారు. దీనికి సంబంధించిన విధి విధానాలను త్వరలోనే ప్రకటిస్తామని మంత్రి తెలిపారు