ప్రస్తుతం 'పుష్ప 2' సినిమాకు సంబంధించిన షాకింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అల్లు అర్జున్, సుకుమార్ మధ్య చెడిందని.. ఇద్దరు అలిగి విదేశాలకు వెళ్లిపోయారని అంటున్నారు. అసలు ఇద్దరి మధ్య ఏం జరుగుతోంది.
Pushpa 2: వాస్తవానికైతే.. ఆగస్టు 15న ‘పుష్ప 2’ రిలీజ్ కావాల్సి ఉంది. కానీ షూటింగ్ డిలే కారణంగా డిసెంబర్ 6కి పోస్ట్ పోన్ అయింది. మేకర్స్ షూటింగ్ లేట్ అవుతుందని చెప్పినప్పటికీ.. ఎన్నికల్లో బన్నీ పై వచ్చిన నెగెటివిటీ కారణంగానే వాయిదా వేశారనేది ఇండస్ట్రీ టాక్. కానీ ఇంకా ఈ సినిమాకి 30 రోజుల రెగ్యులర్ షూటింగ్ పెండింగ్ ఉందనే టాక్ వినిపిస్తోంది. కానీ ప్రస్తుతానికి షూటింగ్ జరగడం లేదని తెలుస్తోంది. దీనికి పలు కారణాలు వినిపిస్తున్నాయి. బన్నీ, సుక్కు అలిగారని.. ఇద్దరూ వేర్వేరుగా విదేశాలకు వెళ్లిపోయారనే టాక్ నడుస్తోంది.
రోజు రోజుకి షూటింగ్ డిలే అవుతున్న నేపథ్యంలో.. బన్నీ అప్సెట్ అయ్యాడని అంటున్నారు. త్వరగా షూటింగ్ పూర్లి చేయడానికి.. మూడు యూనిట్లతో ప్లాన్ చేయమని సుకుమార్‌కు చెప్పాడట బన్నీ. కానీ.. కుదరదు, తొందర పడవద్దు అని చెప్పాడట సుక్కు. దీంతో.. కోపం వచ్చిన బన్నీ గడ్డం ట్రిమ్ చేసుకొని లుక్ మార్చేశాడని అంటున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ ట్రిమ్డ్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే.. కొందరు ఇది పాత లుక్ అంటుంటే.. మరికొందరు కొత్త లుక్ అని అంటున్నారు. కానీ సుకుమార్ పై కోపంతోనే బన్నీ లుక్ మార్చేశాడనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.
మొత్తం మీద.. బన్నీ, సుకుమార్ మధ్య విభేదాలు వచ్చాయనే టాక్ నడుస్తోంది. కానీ మేకర్స్ మాత్రం దీనిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. అయితే.. రేపో మాపో సుకుమార్ ఇండియాకి వస్తారని.. ఆ తర్వాత కొత్త షెడ్యూల్ మీద వర్క్ చేస్తారని అంటున్నారు. బన్నీ కూడా నాలుగైదు రోజుల్లో ఇండియాకి తిరిగొస్తాడని చెబుతున్నారు. ఏదేమైనా.. పుష్ప2 విషయంలో ఏం జరుగుతుందో తెలియాల్సి ఉంది.