»America Has The Ability To Tell India To Stop War With Russia
USA: రష్యాతో యుద్ధం ఆపమని చెప్పే సమర్థత భారత్‌కే ఉంది
ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధాన్ని నిలిపివేయమనే సమర్థత కేవలం భారత్‌కే ఉందని అమెరికా సంచలన వ్యాఖ్యలు చేసింది. నేడు అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో జెలెన్స్కీ భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో భారత్‌పై అమెరికా అధికార ప్రతినిధి చేసిన వ్యాఖ్యలకు ప్రధాన్యత సంతరించుకుంది.
America has the ability to tell India to stop war with Russia
USA: ఉక్రెయిన్ (Ukraine), రష్యా దేశాలు సంవత్సరకాలంగా యుద్ధాన్ని కొనసాగిస్తున్నాయి. ఇరువైపులు ప్రాణ, ఆస్తీ నష్టం సంభవిస్తున్నా ఎవరు తగ్గడం లేదు. ఏ దేశం చెప్పినా వినడం లేదు. దీనిపై అగ్రదేశం అమెరికా చేసిన వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇరు దేశాల నడుమ యుద్ధాన్ని ఆపేసే సామర్థం కేవలం ఒక భారతదేశానికి మాత్రమే ఉందని అమెరికా అధికారిక ప్రతినిధి వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్రమోడీ ద్వైపాక్షిక సంబంధాల కోసం రెండు రోజులు రష్యాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వైట్‌హౌస్ అధికార ప్రతినిధి కరైన్ జీన్ పెర్రీ (Karine Jean-Pierre) ఈ వ్యాఖ్యలు చేశారు. ఈరోజు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden).. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ (Volodymyr Zelenskyy) తో భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా చేసిన ఈ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది.
గురువారం అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో నాటో సదస్సు(NATO summit) జరగనుంది. ఈ సందర్భంగా బైడెన్, జెలెన్స్కీ భేటీ కానున్నారు. రష్యా పర్యటనలో భాగంగా మోడీ యుద్ధం గురించి ప్రస్తావించారు. చర్చల ద్వారా యుద్ధానికి ముగింపు పలకాలని సూచించారు. యుద్ధంలో పసిబిడ్డల మరణం చాలా బాధకరం అని, అలాంటి ఎన్నో హృదయ విధారకమైన సంఘటనలు జరుగుతాయని రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మోడీ అన్నారు. ఆ తరువాత ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడారు. ఉక్రెయిన్‌లోని చిల్డ్రన్స్ ఆసుపత్రిని రష్యా లక్ష్యంగా చేసుకుందని, బాంబులో అక్కడ మారణహోమాన్ని సృష్టిస్తుందని జెలెన్స్కీ ఆరోపించారు. అయితే వీటిని రష్యా తోసిపుచ్చింది. యుద్ధనీతి పాటిస్తున్నట్లు రష్యా విదేశాంగమంత్రి పేర్కొన్నారు.