»Puri Jagannath Puri Bhandagaram To Open After 46 Years
Puri Jagannath: 46 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న పూరీ భాండాగారం
దాదాపు నాలుగున్నర దశాబ్దాల తర్వాత ఒడిశాలోని పూరీ జగన్నాథుడి రత్న భాండాగారం తెరుచుకోనున్నది. ఈ నెల 14న ఆ రత్న భాండాగారాన్ని తెరవాలని కమిటీ కూడా నియమించారు.
Puri Jagannath: Puri Bhandagaram to open after 46 years
Puri Jagannath: దాదాపు నాలుగున్నర దశాబ్దాల తర్వాత ఒడిశాలోని పూరీ జగన్నాథుడి రత్న భాండాగారం తెరుచుకోనున్నది. ఈ నెల 14న ఆ రత్న భాండాగారాన్ని తెరవాలని కమిటీ కూడా నియమించారు. జగన్నాథుని వెలకట్టలేని విలువైన ఆభరణాలను ఐదు కర్రపెట్టెల్లో ఉంచి రహస్య గదిలో భద్రపరిచారు. పూర్వ కాలంలో అప్పుడప్పుడు దానిని తెరిచి సంపద లెక్కించేవారు. కానీ 1978 తర్వాత దాన్ని తెరవలేదు. అప్పట్లో ఆ ఖజానాను లెక్కించడానికి సుమారుగా 70 రోజులు పట్టింది. కొన్నింటిని లెక్కించకుండా వదిలేశారు. 46 ఏళ్ల నుంచి ఈ రత్న భాండాగారాన్ని తెరవలేదు.
రహస్య గదులు జీర్ణావస్థకు చేరి, వర్షపు నీరు లీకై గోడలు బీటలు వారాయి. వీటికి మరమ్మతులు చేయాలని కోర్టులు 2018లోనే పురావస్తు శాఖను ఆదేశించాయి. 2019 ఏప్రిల్ 6న నవీన్ పట్నాయక్ సర్కారు నియమించిన 13 మందితో కూడిన అధ్యయన సంఘం తలుపులు తీయడానికి వెళ్లారు. కానీ ఆ రహస్య గది తాళపుచెవి కనిపించలేదు. అయితే ఇంతలో డూప్లికేట్ తాళపుచెవి పూరీ కలెక్టరేట్ ట్రెజరీలో ఉన్నట్లు గుర్తించారు. ఈ నెల 14న ఆ తాళంతో ఓపెన్ చేస్తారు. దాంతో కూడా తెరుచుకోకపోతే తాళంకప్ప పగలగొట్టి తలుపులు తెరవనున్నారు.