»Massive Transfers Of Collectors In Andhra Pradesh
AP IAS: ఆంధ్రప్రదేశ్లో భారీగా కలెక్టర్ల బదిలీలు
ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాలో కలెక్టర్లను మార్చారు. రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ఏర్పడిన తరువాత ఇప్పుడే తొలిసారిగా ట్రాన్స్ఫర్ చేశారు. ఏఏ జిల్లాలకు ఎవరో చూద్దాం.
AP IAS: ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్ల బదిలీల పర్వం మొదలైంది. రాష్ట్రంలో తాజాగా 11 మంది కలెక్టర్లను ట్రాన్స్ఫర్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చాకా ఇదే తొలిసారి. ఒక సారి 11 మందిని మార్చారు. జిల్లాల వారిగా పల్నాడు జిల్లాకు అరుణ్ బాబు, విశాఖ కలెక్టర్గా హరేంద్ర ప్రసాద్, శ్రీకాకులం జిల్లాకు స్వప్నిల్ దినకర్, నంద్యాల కలెక్టర్గా బి.రాజకుమారి, అన్నమయ్యకు సీహెచ్.శ్రీధర్, పార్వతీపురం మన్యంకు శ్యాంప్రసాద్, సత్యసాయి జిల్లాకు కలెక్టర్గా చేతన్, అనకాపల్లి జిల్లా కలెక్టర్గా కె. విజయ, తిరుపతి జిల్లాకు డి. వెంకటేశ్వర్, అంబేద్కర్ కోనసీమ జిల్లాకు రావిరాల మహేష్ కుమార్, నెల్లూరుకు ఆనంద్, కడప జిల్లాకు లోటేతి శివశంకర్ లను ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.