Current Bills : ఇక గూగుల్ పే, ఫోన్‌పే లాంటి వాటి నుంచి కరెంట్ బిల్లులు కుదరవు!
ఇకపై థర్డ్ పార్టీ పేమెంట్ యాప్‌ల నుంచి కరెంటు బిల్లులు కుదరవు. రిజర్వ్ బ్యాంకు ఈ మేరకు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. పూర్తి సమాచారం కోసం ఇక్కడ చదివేయండి.
Current Bills : ఇటీవల కాలంలో కరెంటు బిల్లులు కట్టడం చాలా సులువు అయిపోయింది. పేటీఎం(Paytm), అమెజాన్, గూగుల్ పే, ఫోన్ పే లాంటి యాప్‌ల నుంచి మనం అంతా సులభంగా బిల్లులు చెల్లించేస్తున్నాయి. అయితే ఇకపై ఇది కుదరదు. థర్డ్ పార్టీ యాప్‌ల నుంచి బిల్లులు చెల్లించడాలన్ని నిలిపివేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలు ఇచ్చింది. దీంతో తాము రాష్ట్ర వ్యాప్తంగా వీటి నుంచి బిల్లులు స్వీకరించబోమని తెలంగాణ విద్యుత్ శాఖ అధికారులు వెల్లడించారు.
ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు బిల్లులు(Electricity bills) చెల్లించాలని అనుకునే వారు టీజీఎస్పీడీసీఎల్ వెబ్సైట్ ద్వారా గాని, మొబైల్ యాప్ ద్వారాగాని ఆన్లైన్లో పే చేయవచ్చని అధికారులు తెలిపారు. ఈ విషయమై దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీ మాట్లాడారు. ఈఆర్వో కార్యాలయాల్లోనూ విద్యుత్ బిల్లులను చెల్లించేందుకు వీలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు.
అయితే ఈ నిర్ణయం దేశ వ్యాప్తంగా ఉన్న మిగిలిన రాష్ట్రాల్లోనూ అమల్లోకి వస్తుందా? రాదా? అన్న విషయం ఇంకా తెలియలేదు. ఈ విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఆన్లైన్ బిల్ పేమెంట్లను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంకు తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రజల నుంచి భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. చాలా మంది ఫోన్‌పే, గూగుల్ పే( Googlepay) లాంటి వాటి నుంచి చెల్లింపులు తేలికగా ఉంటాయని చెబుతున్నారు.