టీ20ల్లో ప్రపంచ రికార్డును ఆస్ట్రేలియా సీనియర్ పేస్ బౌలర్ ఆండ్రూ టై(36)(Andrew Tye) బద్ధలు కొట్టేశాడు. దీంతో టీ20ల్లో అత్యంత వేగంగా 300 వికెట్లు తీసిన బౌలర్‌గా ఆండ్రూ నిలిచాడు. మరోవైపు ఆండ్రూ 211 మ్యాచులలో ఈ మైలురాయిని అందుకోగా.. గతంలో 213 గేమ్‌లలో ఆప్గానిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్(rashid khan) పేరిట ఉన్న 300 వికెట్ల రికార్డును చిత్తు చేశాడు. ఈ సంఘటన ఫిబ్రవరి 4, 2023న పెర్త్ స్టేడియంలో జరిగిన బిగ్ బాష్ లీగ్ (BBL) గేమ్‌లో భాగంగా జేమ్స్ బాజ్లీని అవుట్ చేయడంతో టై ఈ ఫీట్ సాధించాడు.
వెస్ట్రన్ ఆస్ట్రేలియన్ క్రికెటర్ అయిన్ ఆండ్రూ 2014లో అరంగేట్రం చేసినప్పటి నుంచి పొట్టి ఫార్మాట్లో అసాధారణ ప్రతిభ కనబరుస్తున్నాడు. అంతేకాదు ఇతను T20 గ్లోబ్ ట్రాటర్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో కూడా ఆడాడు. గత ఏడాది లక్నో సూపర్ జెయింట్స్ (LSG)లో భాగమయ్యాడు. మూడు మ్యాచులు ఆడి.. రెండు వికెట్లు తీశాడు.