Rahul Gandhi : యూపీలోని రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అధినేత, ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తొలిసారిగా పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది కంచుకోటగా చెప్పుకోవచ్చు. ఆ పార్టీకి చెందిన నాయకులే మొదటి నుండి నాయకత్వం వహిస్తున్నారు. ఓట్ల తేడా 268102కి పెరిగింది. దీంతో రాహుల్ గాంధీ 2019లో రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానంలో తన తల్లి సోనియా గాంధీ సాధించిన మెజార్టీ కంటే ఎక్కువ ఓట్ల ఆధిక్యం సాధించారు. మధ్యాహ్నం 2 గంటల వరకు ఎన్నికల సంఘం విడుదల చేసిన గణాంకాల ప్రకారం రాయ్‌బరేలీ స్థానం నుంచి రాహుల్ గాంధీ 268102 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
చదవండి:Election Result 2024: యూపీలో బీజేపీ పరాభవానికి ప్రధాన కారణాలివే ?
ఓట్ల తేడాలో బీజేపీ అభ్యర్థి దినేష్ ప్రతాప్ సింగ్‌ను రాహుల్ గాంధీ చాలా వెనక్కు నెట్టారు. రాహుల్‌కు 4,99,099 ఓట్లు రాగా, దినేష్ ప్రతాప్ సింగ్‌కు 2,27,347 ఓట్లు వచ్చాయి. సోనియా గాంధీ గత లోక్‌సభ ఎన్నికల్లో రాయ్‌బరేలీ స్థానం నుంచి 1,67,178 ఓట్ల తేడాతో గెలుపొందారు. గతసారి కూడా బీజేపీ అభ్యర్థి దినేష్ ప్రతాప్ సింగ్ రెండో స్థానంలో నిలిచి 3,67,740 ఓట్లు సాధించారు.
చదవండి:Election Result 2024: చంద్రబాబుకు ఫోన్ చేసిన మోడీ, అమిత్ షా
రాహుల్ గాంధీ 2004 నుండి 2019 వరకు అమేథీ నుంచి కాంగ్రెస్ ఎంపీగా ఉన్నారు, అయితే గత లోక్‌సభ ఎన్నికల్లో అమేథీ నుంచి బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. అయితే వాయనాడ్ నుంచి గెలిచి పార్లమెంటుకు చేరుకున్నారు. ఈసారి కూడా ఆయన అమేథీ నుంచి పోటీ చేస్తారని ఊహాగానాలు వచ్చాయి, అయితే పార్టీ ఆయనను రాయ్‌బరేలీ నుంచి పోటీకి దింపింది. అదే సమయంలో రాహుల్ గాంధీ వయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి కూడా ఆధిక్యంలో ఉన్నారు. కమ్యూనిస్టు పార్టీకి చెందిన అన్నీ రాజాపై రాహుల్ గాంధీ 328460 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

