Horoscope Today: నేటి రాశిఫలాలు(2024 June 2nd)..కుటుంబ సౌఖ్యం ఉంటుంది.
ఈ రోజు(2024 June 2nd) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? శుభ ఫలితాలు కోసం ఏం చేయాలో నేటి రాశిఫలాల్లో తెలుసుకుందాం.
మేషం
కొత్త వస్తు, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వ్యాపారరంగంలోని వారు మంచి లాభాన్ని ఆర్జిస్తారు. మంచివారితో స్నేహం కుదురుతుంది. అనుకోని ధనలాభం ఉంటుంది. సన్నిహితుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఒక ముఖ్యమైన సమాచారం అందుతుంది.
వృషభం
శుభకార్య ప్రయత్నాలు నెరవేరుతాయి. బంధువులతో కలుస్తారు. విదేశయాన ప్రయత్నాలు నెరవేరుతాయి. ఆకస్మిక ధనలాభం ఉంది. మీమీ పనుల్లో విజయాన్ని సాధిస్తారు.
మిథునం
ఆకస్మిక ధనలాభం ఉంది. కుటుంబ సౌఖ్యం లభిస్తాయి. దగ్గరి బంధువలను కలుస్తారు. సంఘంలో కీర్తి ప్రతిష్టలు ఏర్పడుతాయి. సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు. ప్రతివిషయంలో మంచి అభివృద్ధి సాధిస్తారు.
కర్కాటకం
మానసిక ఆనందం పొందుతారు. వాయిదా వేసిన పనులు నెరవేరుతాయి. విందులు, వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంది. మీమీ రంగాల్లో అభివృద్ధి సాధిస్తారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది.
సింహం
విదేశయాన ప్రయత్నాలు నెరవేరుతాయి. అనారోగ్య బాధలు వేధిస్తాయి. ధననష్టం ఏర్పడే అవకాశం ఉంది. సన్నిహితులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి. అనవసర వ్యయప్రయాసలకు పోవద్దు.
కన్య
సన్నిహితులను కలుస్తారు. కొత్త ఇంటి ప్రయత్నాలు చేస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంది. కుటుంబ సౌఖ్యం ఉంది. దీర్ఘకాలిక సమస్యలు తొలగి ఆరోగ్యం బాగుంటుంది.
తుల
సంతోషంగా ఉంటారు. శుభవార్త వింటారు. కుటుంబ పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. తోటివారి ప్రశంసలు పొందుతారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా బలంగా ఎదుగుతారు. స్త్రీలు మానసిక ఆనందాన్ని పొందుతారు.
వృశ్చికం
మీ మంచి ప్రవర్తన ఇతరులకు ఆదర్శం. మొదలు పెట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. దైవదర్శనం కలుగుతుంది. స్థిరాస్తులకు సంబంధించి సమస్యలు తొలగిపోతాయి. కళల్లో ఆసక్తి ఏర్పడుతుంది.
ధనుస్సు
ఆకస్మిక ధనలాభం ఉంది. నూతన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. అన్నిరంగాల్లో విజయాన్ని సాధిస్తారు. కొత్త పనులను ప్రారంభిస్తారు. రుణవిముక్తి ఉంది. మానసిక ఆనందం అభిస్తుంది.
మకరం
స్థానచలన సూచికలు ఉన్నాయి. ఇంటిలో మార్పును కోరుకుంటారు. ఇతరులు మిమ్మల్ని విమర్శలు చేస్తారు. స్థిరమైన నిర్ణయాలు
తీసుకోవడంలో విఫలం అవుతారు. అనుకోని ధనవ్యయం ఉంది. సన్నిహితులతో జాగ్రత్తగా ఉండటం మంచిది.
కుంభం
స్థిరాస్తుల విషయంలో జాగ్రత్త అవసరం. మంచి అవకాశాన్ని కోల్పోతారు. కొత్త వ్యక్తుల పరిచయం కలుగుతుంది. ప్రయాణాల వల్ల లాభం పొందుతారు. తలచిన కార్యాలకు ఆటంకాలు ఉన్నాయి.
మీనం
ఆకస్మిక ధననష్టం ఏర్పడుతుంది. ఏ విషయంలోనూ స్థిర నిర్ణయాలు తీసుకోరు. ఆపదల్లో చిక్కుకోకుండా జాగ్రత్త పడాలి. సమాజంలో గౌరవ, మర్యాదలకు భంగం వాటిల్లకుండా జాగ్రత్త పడాలి. మీమీరంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి జరుగుతుంది.