»New Beer Brands In Telangana Photo Viral On Social Media
Telangana: మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్.. రాష్ట్రంలోకి కొత్త బీర్ బ్రాండ్లు
తెలంగాణలో గత కొంత కాలంగా బీర్ల కొరత ఏర్పడింది. వేసవి ప్రారంభం నుండి వాటి సంఖ్య తగ్గింది. చాలా మంది వైన్ ప్రియులు వైన్షాప్లకు వెళ్లి నో స్టాక్ బోర్డులను చూసి నిరాశగా వెనుదిరుగుతున్నారు.
Telangana: తెలంగాణలో గత కొంత కాలంగా బీర్ల కొరత ఏర్పడింది. వేసవి ప్రారంభం నుండి వాటి సంఖ్య తగ్గింది. చాలా మంది వైన్ ప్రియులు వైన్షాప్లకు వెళ్లి నో స్టాక్ బోర్డులను చూసి నిరాశగా వెనుదిరుగుతున్నారు. ఇటీవల కాలంలో వైన్ షాపుల్లో బ్రాండెడ్ బీర్లు దొరకడం లేదని కొందరు అధికారులకు ఫిర్యాదు చేశారు. బీరు కొరత తీర్చాలని కోరారు. మద్యం షాపుల్లో బ్రాండెడ్ బీర్లు అందుబాటులో ఉంచాలని పలువురు ఎక్సైజ్ కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. అయినా కూడా బీర్లు సరిపడా అందుబాటులో ఉండడం లేదు.
ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కొత్త బీరు బ్రాండులకు అనుమతులు ఇచ్చినట్లు సమాచారం. సోమ్ డిస్టిలరీస్ తమ బీర్ బ్రాండ్లను రాష్ట్రంలో సరఫరా చేసేందుకు అనుమతి పొందినట్లు తెలుస్తోంది. తాజాగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో తెలంగాణకు కొత్త బీర్లు రానున్నాయి. పవర్ 1000, బ్లాక్ ఫోర్ట్, హంటర్, వుడ్ పీకర్ బీర్లు అందుబాటులోకి రానున్నాయని తెలుస్తోంది.
మరోవైపు తెలంగాణలో గత మూడు నెలలుగా బీర్ దొరకడం లేదని.. దీని వెనుక భారీ కుట్ర జరుగుతున్నట్లు పలు మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి. కమీషన్ ప్రకారం తెలంగాణలో కొత్త బ్రాండ్లకు గేట్లు తెరిచే అవకాశాలు ఉన్నాయి. ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రానికి కొన్ని బ్రాండ్ల బీర్లు వచ్చే అవకాశం ఉందని కొన్ని మీడియా సంస్థలు తెలిపాయి. ముందుగా మద్యం కొరతను సృష్టించి, దీన్ని సాకుగా తీసుకుని కొత్త బ్రాండ్లను ప్రవేశపెట్టి భారీ కమీషన్ పొందాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు కొన్ని కథనాలలో ప్రస్తావించారు.