సుప్రీం కోర్టులో న్యాయమూర్తులు ఖాళీ పోస్టులను కేంద్ర ప్రభుత్వం భర్తీ చేయనుంది. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసిన పేర్లలో త్వరలోనే ఐదుగురు పేర్లును ఎంపిక చేస్తామని ప్రభుత్వం తెలిపింది. సుప్రీంకోర్టు ,హైకోర్టులో న్యాయమూర్తుల నియామకానికి కొలీజియం చేసిన సిఫారసులను కేంద్ర ప్రభుత్వం సుదీర్ఘంగా పెండింగ్ లో పెట్టిన వ్యవహారంపై అత్యున్నత న్యాయస్థానం విచారణ జరుపుతోంది. ఇదే అంశంపై విచారించిన జస్టిస్ ఎస్ కే కౌల్, జస్టిస్ ఏఏస్ ఓకాతో కూడిన ధర్మాసనం ఎదుట అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి హాజరై కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని తెలిపారు. ఐదుగురు న్యాయమూర్తులను అతి త్వరలో నియమిస్తామని పేర్కొన్నారు.