»I Will Check My Boyfriends Janhvis Comments Are Viral
Janhvi Kapoor: నా బాయ్ ఫ్రెండ్‌ది మాత్రం చెక్ చేస్తా.. జాన్వీ కామెంట్స్ వైరల్!
హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అసవరం లేదు. అయితే.. తాజాగా బాయ్ ఫ్రెండ్ గురించి చెబుతూ జాన్వీ కపూర్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన బాయ్ ఫ్రెండ్‌ది ఖచ్చితంగా చెక్ చేస్తానని చెప్పింది జాన్వీ.
I will check my boyfriend's.. Janhvi's comments are viral!
Janhvi Kapoor: జాన్వీ కపూర్ ఇంకా టాలీవుడ్లోకి అడుగుపెట్టలేదు కానీ, అమ్మడికి ఇక్కడ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దేవర సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్న ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమా రిలీజ్‌కు ముందే రామ్ చరణ్‌తో ఛాన్స్ కొట్టేసింది. దేవర అక్టోబర్ 10న రిలీజ్ అవుతుండగా.. ఆర్సీ 16 త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. దీంతో.. జాన్వీ ఏది మాట్లాడిన క్షణాల్లో వైరల్ అవుతోంది. మామూలుగానే సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్‌గా ఉంటుంది ఈ హాట్ బ్యూటీ. హాట్ హాట్ ఫోటో షూట్‌తో రెచ్చిపోతుంటుంది. అలాగే.. బాయ్ ఫ్రెండ్‌తో షికార్లు చేస్తు హాట్ టాపిక్ అవుతునే ఉంటుంది. ప్రస్తుతం శిఖర్ పహారియాతో జాన్వీ ప్రేమలో ఉందనే రూమర్స్ వినిపస్తునే ఉన్నాయి. కానీ జాన్వీ మాత్రం దీని పై క్లారిటీ ఇవ్వడం లేదు.
ఇదిలా ఉంటే.. లేటెస్ట్గా జాన్వీ కపూర్‌కి ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఎదురైంది. బాలీవుడ్లో ఓ టెలివిజన్ షోలో పాల్గొన్న జాన్వీ కపూర్‌ని.. అక్కడనున్న కొందరు అబ్బాయిలు, అమ్మాయిలు ప్రశ్నలు అడిగారు. ఈ నేపథ్యంలో.. అమ్మాయిలు బాయ్ ఫ్రెండ్ ఫోన్ చెక్ చేయవచ్చా? అని జాన్వీని ఓ అమ్మాయి అడిగింది. దీనికి జాన్వీ.. అవును బాయ్ ఫ్రెండ్ ఫోన్ అమ్మాయిలు చెక్ చేయవచ్చు. నేను ఖచ్చితంగా చెక్ చేస్తాను. అందులో తప్పు లేదు.. అని చెప్పుకొచ్చింది. మరి అమ్మాయి ఫోన్ తన బాయ్ ఫ్రెండ్ చెక్ చేయవచ్చా? అని అడగ్గా.. చేయకూడదు అని సమాధానం చెప్పింది. అరె, ఇదేం న్యాయం అని అడగ్గా.. అమ్మాయిల మీద మీకు నమ్మకం లేదా? అని నవ్వుతూ ఆన్సర్ చేసింది జాన్వీ. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.