»Pinnelli Ramakrishna Reddy Surrendered At Narasaraopet Court Police Watch
Pinnelli Ramakrishna Reddy: పిన్నెల్లి లొంగిపోతాడని నరసరావుపేట కోర్టు వద్ద పోలీసు పహారా
ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో ఏ1గా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు గాలిస్తున్నారు. హైదరాబాద్లో పిన్నెల్లి కారును గుర్తించిన పోలీసులు నరసరావుపేట కోర్టు వద్ద కాపలా కాస్తున్నారు.
Pinnelli Ramakrishna Reddy surrendered at NarasaRaopet court, police watch
Pinnelli Ramakrishna Reddy: ఈవీఎం ధ్వంసం కేసులో ఏ1గా ఉన్న మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. నిన్నటి నుంచి పోలీసుల బృందాలు ఆయన అనుచరుల్ని సైతం వెంబడిస్తున్నారు. మొత్తం 8 బృందాలు రంగంలోకి దిగాయని సమాచారం. బుధవారం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారును హైదరాబాద్లో గుర్తించి నట్లు సమాచారం. అంతే కాకుండా ఆయన కారు డ్రైవర్, గన్ మన్లను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారిని ప్రశ్నించగా ఎలాంటి ప్రయోజనం లేదని తెలసింది.
గత రెండు రోజులనుంచి తిరుగుతున్నా పోలీసులకు దొరకుండా తప్పించుకోవడంతో నేరుగా కోర్టులో లొంగిపోయే సమాచారం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు నరసరావుపేట వన్ టౌన్ పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఎలాగైనా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పట్టుకోవాలని నరసరావుపేట కోర్టు వద్ద పహారా పెంచారు.