ప్రస్తుతం బుట్టబొమ్మ పూజా హెగ్డే పరిస్థితి గొప్పగా చెప్పుకునేంతగా లేదు. రష్మిక లాంటి హీరోయిన్ పాన్ ఇండియా లెవల్లో దూసుకుపోతుంటే, పూజా చేతిలో మాత్రం ఒక్క సినిమా కూడా లేదు. కానీ లేటెస్ట్ ఒక బంపర్ ఆఫర్ అమ్మడి తలుపు తట్టినట్టుగా తెలుస్తోంది.
Pooja Hegde: పూజా చేతిలో సినిమాలు లేకపోగా.. ఉన్న ఆఫర్లను కూడా కుర్ర హీరోయిన్లు ఎగరేసుకుపోతున్నారు. అసలు.. ఒకప్పుడు చేతినిండా సినిమాతో బిజీగా ఉన్న పూజాకు ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ప్రస్తుతం హిందీ సినిమాకు మాత్రమే పరిమితమైంది. ఇలాంటి మయంలో.. బుట్టబొమ్మకు ఒక సూపర్ ఆఫర్ వచ్చినట్టుగా తెలిసింది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తమిళ్ స్టార్ సూర్య హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్గా పూజా ఫైనల్ అయినట్టుగా తెలుస్తోంది.
పూజా చివరగా తమిళంలో దళపతి విజయ్ బీస్ట్ సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేసింది. దీంతో సూర్యతో ఛాన్స్ అంటే, అమ్మడికి గోల్డేన్ ఆఫర్ అనే చెప్పాలి. పూజా హెగ్డే, సూర్య కలిసి సినిమా చేయడం ఇదే మొదటిసారి. త్వరలోనే ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించనుందని సమాచారం. ఇక సూర్య 44 వర్కింగ్ టైటిల్‌తో మొదలు కానున్న ఈ సినిమా షూటింగ్ జూన్ ఫస్ట్ వీక్ నుంచి అండమాన్ దీవులలో స్టార్ట్ కానుందని సమచారం.
ఇక ఈ చిత్రంలో మలయాళ నటుడు జోజు జార్జ్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాను 2డి ఎంటర్టైన్మెంట్, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి కల్కి సినిమా మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. ఏదేమైనా.. పూజా హెగ్డే పనైపోయిందని అనుకుంటున్న సమయంలో.. సూర్యతో ఛాన్స్ అంటే అమ్మడు మంచి ఛాన్స్ కొట్టేసిందనే చెప్పాలి.