తెలంగాణ రాష్ట్ర కేబినెట్ ఈ నెల 5న సమావేశం జరుగనుంది. ప్రగతి భవన్ లో ఉదయం 10:30 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన భేటీ కానుంది. పిబ్రవరి 6న శాసన సభలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్ కు కేబినెట్ ఈ సమావేశంలో ఆమోదం తెలపనుంది. కేబినెట్ భేటి అనంతరం సీఎం కేసీఆర్ మహారాష్ట్రలోని నాందేడ్ కు బయల్దేరి వెళ్లనున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి స్పెషల్ ఫ్లైట్ లో ఆయన నాందేడ్ కు వెళ్లనున్నారు. గురుద్వారా లో కేసీఆర్ దర్శనం చేసుకోనున్నారు. సీఎం ఆధ్వర్యంలో నాందేడ్ లో పలువురు పార్టీలో చేరునున్నారు. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ తమిళిసై ప్రసంగించారు. 2023-24 వార్షిక బడ్జెట్ ను ఈనెల 6న ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది. ఈ సమావేశాల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గవర్నర్ తమిళిసై ప్రసంగానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడంతో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు గవర్నర్ అనుమతి ఇచ్చారు. అందుకనుగుణంగా ఇవాళ ఉభయ సభల సంయుక్త సమావేశం జరుగనుంది.