Viral News: అందమైన వనితా చీరకట్టులో అలా రోడ్డు మీద నడిచి వస్తుంటే చూసే జనాల కళ్లలో ఓ మెరుపు కనిపించడం వినడం తప్ప బహుషా ఎవరు చూసి ఉండరు. కానీ ఈ వీడియో చూస్తే నిజమే అనిపిస్తుంది. ప్రపంచానికి చీరకట్టులో అందం ఉందని నిరుపించిన దేశం భారతదేశం. అయితే జపాన్ నగరంలో ఓ ఇన్ఫ్లుయెన్సర్ మహి శర్మ చీరకట్టుకొని వీధుల్లో నడిచి అందరిని మంత్రముగ్దుల్ని చేసింది. చీరకట్టులో హొయలు పోతూ నడుస్తుంటే చిన్న నుంచి పెద్ద వరకు అందరూ అలా కళ్లప్పగించి చూశారు. ఈ వీడియోను మహి శర్మ తన ఇన్ స్టాగ్రామ్లో పోస్ట్ చేయగా.. అది ఇప్పుడు వైరల్ అవుతుంది.
ఈ వీడియోలో మహి శర్మ నీలి రంగు చీర కట్టుకొని జపాన్ రాజధాని టోక్యోలోని ఓ వీధిలో నడుస్తూ చూసేవారి రియాక్షన్ షూట్ చేసింది. అందరూ చాలా ఆశ్చర్యకరంగా చూస్తుండిపోయారు. కొందరు అయితే తనను ఫోటోలు సైతం తీసుకున్నారు. ఈ వీడియోను పోస్ట్ చేస్తూ.. జపాన్లో చీరకట్టుకొని నడిచా.. చూసే వారి రియాక్షన్ భలే అనిపించింది. ఏదో సరదా కోసం కట్టుకున్నా ఇలా జపనీయులు ఫోటోలు తీసుకుంటారని అస్సలు ఊహించలేదని, వారి స్పందన చూసిన తానుఅవాక్కయినట్లు మహి శర్మ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియోకు 18.5 మిలియన్ వ్యూస్ 5 లక్షల 60 వేల లైక్స్ ఉన్నాయి. దీనిపై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.