ఎప్పుడు బిజీగా ఉండే ముంబాయి నగరంలో ఈరోజు మధ్యాహ్నం దుమ్ము తుపాన్ వచ్చింది. వాతావరణంలో కూడా మార్పులతో పాటు విపరీతంగా దుమ్ము రావడం, ఆకాశం నల్లగా మారిపోవడం వంటివి జరిగాయి.
Mumbai: ఎప్పుడు బిజీగా ఉండే ముంబాయి నగరంలో ఈరోజు మధ్యాహ్నం దుమ్ము తుపాన్ వచ్చింది. వాతావరణంలో కూడా మార్పులు వచ్చాయి. విపరీతంగా దుమ్ము రావడంతో పాటు ఆకాశం నల్లగా మారిపోయింది. తొలకరి చినుకులు కురిశాయి. ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు రావడంతో నగరంలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. కొన్ని ప్రాంతాల్లో బలమైన గాలులు వీచాయి.
కొన్ని ప్రాంతాల్లో వర్షం కూడా కురిసింది. ఘాట్కోపర్, బంద్రా కుర్లా, ధారావి ప్రాంతాల్లో వాతావరణం చాలా మారింది. పాల్గర్, థానే ప్రాంతాల్లో మెరుపులు, ఉరుములతో కూడిన వర్షం పడింది. ఆ ప్రాంతంలో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. కొన్ని ప్రాంతాల్లో భీకర గాలుల వల్ల చెట్లు నేలకూలాయి. ఆరోలి సెక్టర్ 5 ఏరియాలో ఉన్న రోడ్డుపై ఓ భారీ వృక్షం పడిపోయింది. దీని వల్ల అక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది.