»New Car Lost Control And Broke Down During Temple Pooja Video Goes Viral
New car : కొత్త కారుకు ఆలయం దగ్గర పూజలు.. స్తంభాన్ని గుద్ది అక్కడే ధ్వసం!
కొత్త కారు కొన్న ఓ వ్యక్తి దానికి పూజ చేయించడానికి గుడికి తీసుకువెళ్లాడు. తర్వాత అది అదుపు తప్పడంతో గుడి స్తంభాన్ని గుద్దుకుని అక్కడే ధ్వంసం అయ్యింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
New car Damaged after Puja : కొత్త కారు(New Car) కొనుక్కున్న ఆనందం కొన్ని గంటలైనా నిలవలేదు. గుడి దగ్గర పూజ పూర్తయిన తర్వాత కారులో కూర్చున్న వ్యక్తి ఆ కారును కాస్త ముందుకు జరపబోయాడు. తర్వాత బ్రేక్ బదులు పొరపాటున యాక్సలేటర్ని ఒత్తేయడంతో అది నేరుగా గుడిలో ఉన్న స్తంభానికి గుద్దుకుని అక్కడే ద్వంసం అయ్యింది. ఈ ఘటన తమిళనాడులోని కడలూరు జిల్లాలో చోటు చేసుకుంది.
స్తంభాన్ని గుద్దుకోవడంతో కారు ముందు భాగం అంతా బాగా పాడైపోయింది. అయితే ఈ ఘటనలో కారు నడుపుతున్న యజమాని మాత్రం సురక్షితంగా బయటపడ్డాడు. ఈ ఘటన అంతా ఆలయంలో ఏర్పాటు చేసిన సీసీ టీవీలో రికార్డు అయ్యింది. ఈ క్లిప్ బయటకు రావడంతో ఇప్పుడు సోషల్ మీడియాల్లో, నెట్టింట్లో ఇది వైరల్‌గా మారింది.
ఈ కారును కొనుక్కున్న వ్యక్తి పేరు సుధాకర్. కారును కొనుక్కుని దాన్ని తీసుకుని అక్కడి శ్రీముష్ణం ప్రాంతంలో ఉన్న ఆలయానికి(Temple) వచ్చాడు. పూల దండతో ఉన్న కారు మొదటి రైడ్‌లోనే ఇలా జరగడంతో యజమాని నిరాశకు గురయ్యాడు. ఈ ఘటన తర్వాత కారును పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.