Tillu Square: దెబ్బకు లిల్లీని సెట్ చేసిన టిల్లుగాడు!
అప్పటి వరకు అనుపమా పెద్దగా హద్దులు దాటలేదు. దీంతో.. టిల్లు స్క్వేర్ అనుపమా బోల్డ్నెస్ చూసి కుర్రాళ్లకు పిచ్చెక్కిపోయింది. అమ్మడి అందానికి ఫిదా అయ్యారు. ఇక్కడి నుంచి అనుపమా పరమేశ్వరన్ తగ్గేదేలే అంటోంది.
Tillu Square: మళయాళీ ముద్దుగుమ్మ అనుపమా పరమేశ్వరన్ కెరీర్ తీసుకుంటే.. టిల్లు స్క్వేర్ సినిమాకు ముందు, ఆ తర్వాత అనే చెప్పాలి. అప్పటి వరకు ఎలాంటి హద్దులు దాటకుండా ఉన్న అను.. టిల్లుగాడితో మాత్రం ఓ రేంజ్లో రెచ్చిపోయింది. లిప్ లాక్స్, బోల్డ్ సీన్స్‌తో కుర్రాళ్లకు కునుకు లేకుండా చేసింది. దీంతో అమ్మడి కెరీర్ మరింత ఊపందుకుంది. చెప్పాలంటే.. టిల్లు స్క్వేర్ సినిమాకు ముందు అనుపమకు పెద్దగా ఆఫర్లు లేవు. కార్తికేయ2 లాంటి పాన్ ఇండియా హిట్ కొట్టినప్పటికీ.. ఆశించిన స్థాయిలో ఆఫర్లు మాత్రం అందుకోలేకపోయింది. కానీ టిల్లుగాడి ఎంట్రీతో అనుపమా క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. టిల్లు స్క్వేర్ సినిమా సక్సెస్‌తో అమ్మడి కెరీర్ జెట్ స్పీడ్‌లో దూసుకుపోతోంది. బ్యాక్ టూ బ్యాక్ ప్రాజెక్ట్స్ సైన్ చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది.
ప్రస్తుతం అనుపమ పరమేశ్వరన్ చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయి. మరికొన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి. ఇప్పటికే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ‘ఆక్టోపస్’ అనే చిత్రంలో నటిస్తోంది. రీసెంట్గా ‘పరదా’ అనే లేడీ ఓరియెంటెడ్ మూవీని కూడా అనౌన్స్ చేసింది. ‘సినిమా బండి’ దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇక కోలీవుడ్‌లో చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్‌తో సూపర్ ఛాన్స్ అందుకుంది. మారి సెల్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘బైసన్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అలాగే.. లైకా ప్రొడక్షన్లో ‘లాక్ డౌన్’ అనే లేడీ ఓరియంటెడ్ సినిమా కూడా చేస్తోంది. ‘జె. ఎస్. కె’ అనే మలయాళ మూవీలో కూడా నటిస్తోంది. ఏదేమైనా.. ఒక్క దెబ్బకు అనుపమను కెరీర్‌ను సెట్ చేసేశాడు టిల్లుగాడు.