మోస్ట్ అవైటేడ్ ప్రాజెక్ట్ పుష్ప2 పై ఎక్కడా లేని అంచనాలున్నాయి. ఈ సినిమా అప్డేట్స్ కోసం సినీ అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్ చేసిన మేకర్స్.. ఇప్పుడు పాటకు ముందే సెన్సేషనల్ సర్ప్రైజ్ అంటూ అప్టేడ్ ఇచ్చారు.
Pushpa 2: Before the song.. 'Pushpa 2' Sensational Surprise!
Pushpa 2: పుష్ప2 సినిమా పై ఉన్న హైప్ ఎలా ఉందో చూస్తునే ఉన్నాం. ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చిన.. పాన్ ఇండియా లెవల్లో రీసౌండ్ వస్తోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ అంచనాలను అమాంతం పెంచేసింది. ముఖ్యంగా నార్త్ ఇండియాలో పుష్పరాజ్ క్రేజ్ నెక్స్ట్ లెవల్ అనేలా ఉంది. పుష్ప2 థియేటర్లోకి రావడమే లేట్.. బాక్సాఫీస్ బద్దలవుతుందనేలా వెయిట్ చేస్తున్నారు అక్కడి జనాలు. అందుకు తగ్గట్టే.. అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా, ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు సుకుమార్.
వచ్చే ఆగష్టు 15న పుష్ప2 ప్రపంచ వ్యాప్తంగా చాలా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో ఒక్కో అప్డేట్ ఇస్తు వస్తున్నారు మేకర్స్. అందులోభాగంగా మే 1న పుష్ప2 ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రోమో ట్రెండింగ్‌లో ఉంది. ప్రస్తుతానికి మూవీ లవర్స్ అంతా పుష్ప2 ఫస్ట్ సింగిల్ కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ లేటెస్ట్గా మరో సాలిడ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ ఫస్ట్ సింగిల్ వచ్చే లోపే ఒక సెన్సేషనల్ సర్ప్రైజ్ని అందిస్తున్నట్టుగా ట్వీట్ చేశారు.
దీంతో పాటకు ముందొచ్చే ఈ సర్ప్రైజ్ ఏంటి? అనేది ఆసక్తికరంగా మారింది. ఇది పాటకి సంబంధించినదా? లేదా మరో కొత్త అప్టేట్ ఏదైనా ఇస్తారా? అనేది వేచి చూడాలి. అయితే.. మే 1 కంటే ముందే ఫస్ట్ సింగిల్ రిలీజ్‌కు ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? అనేది కూడా తెలియాల్సి ఉంది. మొత్తంగా.. సెన్సేషనల్ సర్ప్రైజ్ అంటూ తెగ ఊరిస్తున్నారు మేకర్స్. మరి పుష్పరాజ్ ఇచ్చే ఆ సర్ప్రైజ్ ఏంటో చూడాలి.