Family Star: హిట్ అన్నారు.. కానీ 3 వారాల్లోనే ఓటిటిలోకి!
అరె బాబు.. మా సినిమా హిట్ అని తెగ ప్రమోట్ చేశాడు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. కానీ పట్టుమని మూడు వారాలు కాకముందే థియేటర్ నుంచి ఓటిటిలోకి షిప్ట్ కాబోతోంది ఫ్యామిలీ స్టార్. మరి ఓటిటిలో ఫ్యామిలీ స్టార్ పరిస్థితేంటి?
Family Star: Hit said.. but within 3 weeks to OTT!
Family Star: సమ్మర్ సీజన్‌ను క్యాష్ చేసుకోవడానికి వచ్చిన సినిమాల్లో డీజె టిల్లు మంచి సక్సెస్ అయింది. కానీ ఫ్యామిలీ స్టార్ మాత్రం ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ నటించిన రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా ఫ్యామిలీ స్టార్.. ఏప్రిల్ 5న ఆడియెన్స్ ముందుకు వచ్చింది. సర్కారు వారి పాట తర్వాత పరశురాం డైరెక్ట్ చేసిన ఈ మూవీని.. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు. ఈ సినిమా ప్రమోషన్స్‌ను ఓ రేంజ్లో చేశారు మేకర్స్. హీరో, హీరోయిన్లతో కలిసి తెగ సందడి చేశాడు దిల్ రాజు.
ఖుషి తర్వాత ఈ సినిమాతో మరో డీసెంట్ హిట్ కొట్టాలని అనుకున్నాడు విజయ్ దేవరకొండ. కానీ ఈ సినిమా తొలి రోజు నుంచే మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. రోజు రోజుకి ఈ సినిమా వసూళ్లు దారుణంగా తగ్గిపోయాయి. దీంతో.. దిల్ రాజుకి నష్టాలు కూడా వచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. మొత్తంగా.. ఊహించని విధంగా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేసింది. మేకర్స్ ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి సాలిడ్ రెస్పాన్స్ వచ్చిందని చెప్పినప్పటికీ.. మూడు వారాల్లోనే ఓటిటిలోకి వచ్చేస్తోంది ఫ్యామిలీ స్టార్.
ఈ సినిమా ఓటిటి హక్కులను ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. దీంతో ఏప్రిల్ 26న నుంచి సినిమాను ఓటిటిలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారిక ప్రకటన వచ్చేసింది. తెలుగుతోపాటు తమిళంలోనూ ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రైమ్ వీడియో వెల్లడించింది. మరి థియేటర్లలో ఫెయిలైన ఈ సినిమా.. ఓటిటి ప్రేక్షకులను అయిన మెప్పిస్తుందా? అనేది వేచి చూడాల్సిందే.