వేసవి కాలం వచ్చిందంటే చర్మ సమస్యలు మొదలు కావడంతో పాటు చర్మం జిడ్డుగా మారడం, మొటిమలు, చర్మం పొడిబారడం, నల్లగా మారడం వంటి సమస్యలన్ని కనిపిస్తాయి. అయితే వేసవిలో చర్మాన్ని రక్షించుకోవాలని చాలామంది బ్యూటీ పార్లర్‌కి కూడా వెళ్తుంటారు. కానీ ఫలితం ఉండదు. అయితే వేసవిలో అందాన్ని కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు పాటించాల్సిందే.
Skin Care: స్నానం చేసే నీటిలో వేపాకులు వేయాలి. ఆ నీటితో స్నానం చేస్తే ముఖంపై బ్లాక్‌హెడ్స్ తగ్గడంతో పాటు చర్మ సమస్యలు కూడా దరిచేరవు. అలాగే రోజూ రాత్రి చర్మానికి కలబంద జెల్‌ను అప్లై చేయడం వల్ల ముఖంపై మచ్చలు తగ్గుతాయి. ఎండలోకి వెళ్లే ముందు సన్‌స్క్రీన్ లోషన్ తప్పనిసరి. ఇది మీ చర్మాన్ని ఎండ నుంచి కాపాడుతుంది. తినే ఆహారంలో కూడా క్యారెట్, కీర, మజ్జిగ, పెరుగు, జ్యూస్‌లు చేర్చుకోవాలి. నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి. ఇలా నీళ్లు తాగడం వల్ల చర్మం గ్లోగా కనిపిస్తుంది. స్కీన్‌కి అప్పుడపుడూ మసాజ్ చేయండి.
టమాటా, నిమ్మరసం, పంచదార కలిపి ముఖానికి అప్లై చేయాలి. లేదంటే పెరుగు, శనగపిండి, బియ్యప్పిండితో ప్యాక్ తయారు చేసుకుని చర్మానికి అప్లై చేయాలి. ఆ తర్వాత బాదం నూనెతో ఆ ప్యాక్‌ను తొలగిస్తే చర్మంపై మృతకణాలు తొలగిపోయి.. స్కిన్ ప్రకాశవంతంగా ఉంటుంది. ఇలా ఇంట్లోనే సహజంగా తయారు చేసిన ప్యాక్‌లను వారానికొకసారి అప్లై చేయడం వల్ల వేసవిలో చర్మం అందంగా, మెరుస్తూ ఉంటుంది.