Gold Rates Today : కొనుగోళ్ల డిమాండ్.. రూ.76వేలకు చేరిన బంగారం
కొనుగోళ్ల డిమాండ్ ఎక్కువ కావడంతో దేశంలో పసిడి ధరలు పరుగులు తీస్తున్నాయి. వెండి ధరలు సైతం పెరుగుతున్నప్పటికీ నేడు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. దేని ధర ఎంత ఉందనేది తెలియాలంటే ఇది చదివేయండి.
Gold and Silver Rates Today : పసిడిని కొనుక్కోవాలని, పెట్టుబడి మార్గంగా మలుచుకోవాలని ఆలోచనల్లో ఉన్న వారు రోజువారీ పసిడి రేట్లను తెలుసుకుంటూ ఉండటం అత్యావస్యకం. ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్ పరిస్థితులు అంత అనుకూలంగా లేకపోవడంతో చాలా మంది ఎక్కువగా బంగారం మీదే పెట్టుబడి పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారు. పెళ్లిళ్ల సీజన్ కూడా కావడంతో బంగారం రేట్లు రికార్డు స్థాయిలో పెరుగుతూ వస్తున్నాయి. దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర నిన్న రూ.75,892 ఉండగా, శుక్రవారం నాటికి రూ.249 పెరిగి రూ.76,141కు చేరుకుంది.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ప్రొద్దుటూరు తదితర ప్రధాన పట్టణాల్లోనూ పది గ్రాముల పసిడి ధర(Gold Rate) రూ.76,141గా కొనసాగుతోంది. ఈ ధరలు మార్కెట్ ప్రారంభ సమయంలో ఉన్నవని గుర్తుంచుకోవాలి. కొనుగోలుదారులు నగల్ని కొనుగోలు చేస్తున్నప్పుడు జీఎస్టీ, మజూరీల్లాంటివి అదనంగా తోడవుతాయని గమనించుకోవాలి.
దేశీయ మార్కెట్లలో వెండి ధర(Silver Rate)లు సైతం రికార్డు గరిష్ఠానికి చేరుకున్నాయి. అయితే శుక్రవారం మాత్రం స్వల్పంగా రూ.20 తగ్గుముఖం పట్టాయి. దీంతో కిలో వెండి ధర రూ.85,860కు చేరుకుంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ప్రొద్దుటూరుల్లోనూ దాదాపు ఇదే ధరలు కొనసాగుతున్నాయి.
ఇక అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్, సిల్వర్ ధరలు సైతం క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. శుక్రవారం పది డాలర్ల మేర పెరిగిన స్పాట్ గోల్డ్ 2,392 డాలర్లకు చేరుకుంది. అలాగే వెండి ధర 28.41 డాలర్లుగా ఉంది.