కుటుంబ సభ్యులతో అందుబాటులో ఉండేందుకు జైలులో ఉన్న అధికారులు ఖైదీలకు స్మార్ట్ కార్డులు అందజేశారు. ఈ కార్డులు ద్వారా వారంలో మూడుసార్లు కుటుంబ సభ్యులు, లాయర్లతో ఉచితంగా మాట్లాడుకోవచ్చు.
Smart Cards: Smart cards for inmates to talk to families
Smart Cards: కుటుంబ సభ్యులతో అందుబాటులో ఉండేందుకు జైలులో ఉన్న అధికారులు ఖైదీలకు స్మార్ట్ కార్డులు అందజేశారు. ఈ కార్డులు ద్వారా వారంలో మూడుసార్లు కుటుంబ సభ్యులు, లాయర్లతో ఉచితంగా మాట్లాడుకోవచ్చు. మహారాష్ట్రలోని హర్సుల్ సెంట్రల్ జైలులోని సుమారు 650 మంది ఖైదీలకు స్మార్ట్ కార్డులను జైలు అధికారులు అందజేశారు. వారంలో మూడుసార్లు ఆరు నిమిషాల చొప్పున కుటుంబ సభ్యులు లేదా న్యాయవాదులతో ఉచితంగా మాట్లాడుకోవచ్చు.
చాలామంది కుటుంబ సభ్యులు ఆర్థిక పరిస్థితులు కారణంగా ఖైదీలను కలుసుకునేందుకు రాలేకపోతున్నారని అధికారులు తెలిపారు. అందుకే కుటుంబ సభ్యులతో పాటు న్యాయవాదులతో మాట్లాడుకునేందుకు 650 మంది ఖైదీలకు స్మార్ట్ కార్డులు అందించినట్లు తెలిపారు. ఖైదీలతో పాటు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న వాళ్ల కోసం జైలు ఆవరణలో కాలింగ్ బూత్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు జైలు అధికారులు తెలిపారు. అయితే ఖైదీలు జైలు అధికారులకు ముందుగా అందజేసిన ఫోన్ నంబర్లకు మాత్రమే కాల్ చేసే అవకాశం ఉందా? లేక ఏ ఫోన్ నంబర్‌కైనా కాల్ చేసుకోవచ్చా? అనే విషయంపై ఇంకా స్పష్టంగా తెలియదు.