Pv Sindhu : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని స్టార్ షట్లర్, ఒలింపిక్ పతక విజేత (Olympic medalist) పీవీ సింధు (PV Sindhu) దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి సేవలో సింధు పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయం వద్దకు చేరుకున్నారు. అక్కడ సింధుకు తితిదే అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సింధు(Sindhu) రంగ నాయకుల మండపం దగ్గరకు చేరుకున్నారు. అక్కడ పండితులు సింధుకు వేదాశీర్వచనం చేశారు. అనంతరం వారి కుటుంబ సభ్యులు అందరికీ స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని సింధు అన్నారు. మలేషియా, ఇండోనేషియా టోర్నమెంట్లలో పాల్గొనబోతున్నానని తర్వాత ఒలంపిక్స్‌కి వెళతానని సింధు చెప్పారు.
2013లో చైలో జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్ లో సింధు పతకం సాధించారు. ఈ ఛాంపియన్ షిప్లో పతకం గెలిచిన మొట్టమొదటి భారతీయురాలిగా చరిత్ర సృష్టించారు. 2016 ఆగస్టులో జరిగిన రియో ఒలింపిక్స్ లో సెమీఫైనల్ కు చేరుకున్నారు. సెమీఫైనల్ లో జపాన్ కు చెందిన నోజోమీని ఓడించి ఒలింపిక్ క్రీడల్లో బ్యాడ్మింటన్ విభాగంలో ఫైనల్ చేరిన తొలి భారతీయ మహిళగా నిలిచింది. తరువాత జరిగిన ఫైనల్లో ఓడి ఒలింపిక్స్ లో పతకం సాధించిన మొట్టమొదటి భారతీయ షట్లర్‌గా(Shuttler) రికార్డులకెక్కారు.