»Thota Trimurthulu Ycp Mlc Jailed In Shiromundanam Case
Thota Trimurthulu: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష
శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు కోర్టు జైలు శిక్ష విధించింది. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 28 ఏళ్ల నాటి శిరోముండనం కేసులో.. విశాఖ ఎస్సీ, ఎస్టీ కోర్టు త్రిమూర్తులకు జైలు శిక్ష విధించింది.
Thota Trimurthulu: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు కోర్టు జైలు శిక్ష విధించింది. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 28 ఏళ్ల నాటి శిరోముండనం కేసులో.. విశాఖ ఎస్సీ, ఎస్టీ కోర్టు త్రిమూర్తులకు 18 నెలల జైలుశిక్ష, లక్షన్నర జరిమానా విధించింది. దళితులకు శిరోముండనం చేసినందుకు ఈ కేసు 28ఏళ్లకు పైగా విచారణ జరిగింది. తాజాగా కోర్టు తీర్పును వెలువరించింది. అయితే ఈ కేసులో తోట త్రిమూర్తులతో పాటు మరో 9 మంది నిందితులకు కూడా కోర్టు శిక్ష విధించింది.
1994లో రామచంద్రాపురం నుంచి ఇండిపెండెంట్గా ఎమ్యెల్యేగా గెలిచిన తర్వాత త్రిమూర్తులు దళితులపై దాడులకు పాల్పడ్డారు. రాజకీయంగా ఎదురు తిరుగుతున్నారని అయిదుగరు దళితుల్ని హింసించి కనుబొమ్మలు తొలగించి, శిరోముండనం చేశారు. ఈ ఘటనపై 1997లో కేసు నమోదైంది. ఇప్పటివరకు ఈ కేసు 146 సార్లు వాయిదా పడింది. చివరికి న్యాయం జరిగిందని బాధితుల కుటుంబాలు ఆనందం వ్యక్తం చేశారు.