»What Is Americas Reaction To Uks Article Against India
America: భారత్‌కు వ్యతిరేకంగా రాసిన యూకే కథనంపై అమెరికా ఏమందంటే?
పాకిస్థాన్‌లో ఉగ్రవాదుల మిస్టరీ మరణాల వెనుకు భారత్ ఉందంటూ యూకే మీడియా రాసిన కథనంపై అమెరికా స్పందించింది. విదేశాంగ ఖాఖ ప్రతినిధి మ్యాథ్యూ మిల్లర్ మాట్లాడారు.
What is America's reaction to UK's article against India?
America: భారతదేశం గురించి బ్రిటన్ దేశంలోని ఓ మీడియా ఇటీవల ఓ కథనాన్ని ప్రచురించింది. పాకిస్థాన్‌లో ఉగ్రవాదుల మిస్టరీ మరణాల వెనుక ఇండియా ఉందంటూకథనాలు రాసుకొచ్చింది. తాజాగా దీనిపై అమెరికా స్పందించింది. ఇరు దేశాలు చర్చల ద్వారా తమ సమస్యలను పరిష్కరించుకోవాలని చూచించింది. దీనిపై మన విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్ సైతం స్పందించారు. ఇది పూర్తిగా నిరాధారమైనది పేర్కొన్నారు. దీనిపై అమెరికా విదేశాంగ శాఖా ప్రతినిధి మ్యాథ్యూ మిల్లర్ మాట్లాడుతూ.. ఆ మీడియా కథనం తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు.
బ్రిటన్ మీడియా చేస్తున్న ఆరోపణలపై తాము మాట్లాడానికి, జోక్యం చేసుకోవడానికి ఏమీ లేదని. ఉద్రిక్తతలు నివారించేందుకు రెండు దేశాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. అయితే బ్రిటన్‌కు చెందిన ‘ది గార్డియన్’ పత్రిక భారత్‌పై ఇటీవల ఈ ఆరోపణలు ప్రచురించింది. 2019లో పుల్వామా ఘటన తర్వాత భారత్‌కు ప్రమాదకరంగా మారుతున్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకొందని పేర్కొంది. ఇండియా విదేశీ ఇంటెలిజెన్స్ సంస్థ రా దాదాపు 20 హత్యలు చేయించిందని ఆరోపించింది. భారత్, పాక్ ఇంటెలిజెన్స్ అధికారులు ఇచ్చిన సమాచారంతో ఈ కథనం రాసినట్లు పేర్కొంది. దీనిపై ఎస్ జైశంకర్ మాట్లాడుతూ.. అది పూర్తిగా తప్పుడు సమాచారమని, ఇది భారత వ్యతిరేక ప్రచారమని పేర్కొంది.