»Vijay Devarakonda Vijay Devarakonda Does Not Tell Lies But What Are These Lies
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ అబద్దాలు చెప్పడు.. కానీ ఇవేం బూతులు?
విజయ్ దేవరకొండ గురించి మళ్లీ రచ్చ మొదలైంది. లైగర్ సినిమా రిలీజ్ సమయంలో.. కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడని.. అతనికి అటిట్యూడ్ ఎక్కువని.. ఇలా ఒకటి కాదు, ఎన్ని రకాల చర్చ జరిగిందో.. అంతకుమించి జరిగింది. ఇప్పుడు కూడా రౌడీ పై ఓ రేంజ్లో కామెంట్స్ చేస్తున్నారు.
Vijay Devarakonda: ఒక్క లైగర్ విషయంలోనే కాదు.. గతంలో కూడా రౌడీ పై ఎన్నో కామెంట్స్ వినిపించాయి. కానీ విజయ్ దేవరకొండ మాత్రం నెగెటివిటీనే పాజిటివిటీగా మార్చుకొని డబుల్ ఫోర్స్‌తో దూసుకుపోతున్నాడు. ఖుషి సినిమా నుంచి సక్సెస్ ట్రాక్ ఎక్కిన రౌడీ.. ఈసారి ఫ్యామిలీ స్టార్‌తో 200 కోట్లు కొడతాననే గట్టి కాన్ఫిడెంట్‌తో ఉన్నాడు. అయితే.. నిన్న మొన్నటి వరకు ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్స్ బాగానే అయ్యాయి. కానీ ఇప్పుడు మళ్లీ రౌడీ గురించి రచ్చ మొదలైంది.
విజయ్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. తాను కూడా మిడిల్ క్లాస్ అని.. చెబుతూ వస్తున్నాడు. బండిలో పెట్రోల్ కూడా ఎప్పుడూ ఫుల్‌గా కొట్టించలేదు. పెళ్లి చూపులు తర్వాతే ఫుల్‌గా కొట్టించానని.. చెప్పుకొచ్చాడు. దీని పై రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. ఓ నెటిజన్ రిప్లై ఇస్తూ.. అతను మరీ అంత పూర్ కాదు, బాగా ఉన్న ఫ్యామిలీ నుంచే వచ్చాడు.. అనే కామెంట్స్ చేసాడు. దీంతో ఆ నెటిజన్‌కి బేబీ నిర్మాత SKN కౌంటర్ ఇస్తూ.. ఆయన మిడిల్ క్లాస్ బ్యాక్ గ్రౌండ్ అని.. కంటెంట్ బాగోకపోతే మనం సినిమా చూడము, రిచ్ అని కంటెంట్ బాగుంటే ఆగిపోము. అతను ఎలాంటి అబద్దాలు చెప్పట్లేదు. వాళ్లు సింపుల్ మిడిల్ క్లాస్.
శ్రీనగర్ కాలనిలో ఓ రెంట్ ఇంట్లో ఉన్నప్పటి నుంచి విజయ్ నాకు తెలుసు.. అని రాసుకొచ్చాడు. ఇక ఇదిలా ఉండగానే.. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మృణాల్ ఠాకూర్‌ను బైక్‌పై ఎక్కించుకుని వచ్చాడు విజయ్. ఈ నేపథ్యంలో ఫుల్ జోష్‌లో ఉన్న విజయ్.. ఆ ఫ్లోలో ఓ బూతు పదాన్ని వాడాడు. దీంతో పబ్లిక్‌లో అలాంటి మాటలేంటి బ్రో అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. మొత్తంగా.. ఫ్యామిలీ స్టార్ విషయంలోను విజయ్ దేవరకొండ పై ఊహించని కామెంట్స్ వస్తున్నాయనే చెప్పాలి.