తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కార్యకర్తలకు, నేతలకు సోషల్ మీడియా ద్వారా చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయం అంటే అధికారం అనుభవించడం కాదు.. ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారని చంద్రబాబు తెలిపారు.
Chandrababu: తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కార్యకర్తలకు, నేతలకు సోషల్ మీడియా ద్వారా చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయం అంటే అధికారం అనుభవించడం కాదు.. ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారని చంద్రబాబు తెలిపారు. కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు, పొట్టి శ్రీరాములు, అంబేడ్కర్, జ్యోతిబా పులే వంటి మహనీయుల స్ఫూర్తితో 1982లో ఇదే రోజున ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ప్రకటించారని తెలిపారు.
బడుగు, బలహీన వర్గాల ప్రజలు కేవలం ఓటర్లుగా మిగిలిపోకుండా రాజకీయాలను శాసించే స్థాయికి వెళ్లాలనే ఉద్దేశంతో పార్టీ, ప్రభుత్వంలో కీలక బాధ్యతలు ఇచ్చారని తెలిపారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా టీడీపీ కృషి చేస్తోందని చంద్రబాబు తెలిపారు. బంగారు భవిష్యత్తు కోసం ఇకపై అంకిత భావంతో కృషి చేస్తామని చంద్రబాబు తెలిపారు. తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం పుట్టిందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు.