AP: అమరావతి చట్టబద్ధత బిల్లును ఆమోదించడంతో మంత్రి DSBV స్వామి ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. బాణసంచా కాల్చి, స్వీట్లు పంచుకుని కూటమి నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘రాష్ట్ర చరిత్రలో ఇవాళ సువర్ణ అధ్యాయం. ఆంధ్రుల రాజధాని ఇక ఎన్నటికీ అమరావతే. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు.